Friday, November 22, 2024

TS : ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం.. హరీష్​రావు ఫైర్​

ఆరుగ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు . ఆరింటిలో ఐదు అమలు చేశామని రేవంత్ చెప్పుకోవ‌డం అబద్ధం అని కొట్టిపారేశారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.

- Advertisement -

జనవరిలో ఆసరా పింఛన్లు ఇవ్వలేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం జ‌రిగిన‌ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి గురించి అసెంబ్లీలో భట్టి అబద్ధాలు చెప్పారన్నారు. గృహజ్యోతి కింద కేవలం 30 లక్షల మందికే అమలు చేశారన్నారు.

రైతులు, మహిళలు, పేదలను, యువత, నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేదన్నారు. ఆసరా పెన్షన్లు పెంచుడు మాట ఏమో కానీ కనీసం జనవరి నెలలో పెన్షన్లే ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు ఇస్తామని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా? అని జనం బాధపడుతున్నారని అన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు.

కాంగ్రెస్ కు ఎందుకు ఓటేశామా అని జనం బాధ పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందని సెటైర్లు వేశారు. బౌన్స్ అయినందుకు కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో శిక్షించాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ పరువు తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement