సీఎం కేసీఆర్ తన అధికార కాంక్ష, కక్ష సాదింపులతో ప్రజల ప్రాణాలను గాలికి వదిలేయ వద్దని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిరంజన్ అన్నారు. ఈటెల ప్రత్యారోపణల దృష్ట్యా కేసీఆర్ పాలనపై సిబిఐతో విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. కరోనా పాజిటివ్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌజ్ లో, అంతా తానై వ్యవహరించే ఆయన తనయుడు కేటీఆర్ ఆస్పత్రిలో ఉన్నారని పేర్కొన్నారు మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జా కేసులో ఇరుక్కుని విచారణలతో సతమతమవుతుంటే , ఇక కరోనా కోరల్లో ఇరుక్కున్న ప్రజలకు దిక్కెవరు ? అని ప్రశ్నించారు. ఇవాళ్టి నుండి 18- 45 మధ్య వయసున్న వారికి ఇస్తామన్న వ్యాక్షిన్ కు అతీ గతీ లేదని విమర్శించారు.
వ్యాక్షిన్ కొరతతో ఇవాళ, రేపు ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యాక్షిన్ వేయమని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఆసుపత్రులలో బెడ్లు, ఆక్షిజన్, మందులు లేవని మండిపడ్డారు. ప్రజలు బ్లాక్ లో కొనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఇన్ని అగచాట్లు పడుతున్నా, ఫామ్ హౌజ్ లో పడకేసిన ముఖ్యమంత్రి, ఆఘమేఘాల మీద ఈటెల కబ్జా భూముల విచారణ కోసం మొత్తం అధికార యంత్రాంగాన్ని రాత్రికి రాత్రి పంపించారని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి రాత్రికి రాత్రి వ్యాక్షిన్, మందులను, బెడ్లను, ఆక్షిజన్ ఏర్పాట్లు చేయలేరు? బ్లాక్ మార్కెట్ అరికట్టలేరు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.