హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించినప్పుడు పదేళ్లుగా తమకు ఒక్క సారి కూడా ఆహ్వానం రాలేదని, కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఆహ్వానం పంపించామని తెలంగాణ రాష్ర్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీ భవనంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకనుగుణంగా తెలంగాణకు ఒక గీతం ఉండాలని, నాడు ఉద్యమానికి రాష్ట్ర గీతం ఆవిష్కరిస్తామన్నారు. రాజకీయంగా విమర్శలకు ఇది వేదిక కాదని, అన్ని రాజకీయ పార్టీలు వేడుకల్లో పాల్గొనాలని కోరారు. తెలంగాణ అమరులను ప్రధాని నరేంద్ర మోడీ అవమానించారని అన్నారు. సుష్మాస్వరాజ్ సేవలు కూడా తాము మార్చుపోమని గుర్తు చేశారు.
- Advertisement -