Monday, November 25, 2024

ఇక్కడ దిక్కులేదు కానీ విశాఖ లో పోరాడతావా ?

ఎంపీ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. పెరిగిన నిత్యవసరాల ధరలు, గ్యాస్-పెట్రోల్-డీజిల్ ధరల పై పార్లమెంట్ లో పోరాటానికి మీ ఎంపీలు మొఖం చాటేశారు. మీ ఎంపీలు పార్లమెంటుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు రేవంత్. మోడీ అంటే భయపడుతున్నారా రాజీ పడుతున్నారా.. బీజేపీ పై గల్లీలో మీ మాటలకు, ఢిల్లీలో చేతలకు పొంతన కుదరడం లేదన్నారు.

విశాఖ ఉక్కు పోరాటానికి మీ మద్ధతు వెనుక దురుద్దేశం ఉందని..ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధికోసమే ఈ ఎత్తుగడఅని లేఖలో పేర్కొన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటిపై మీరు పోరాడరు కానీ… విశాఖ ఉక్కు కోసం పోరాడతారా అని ప్రశ్నించారు. మీ మోసం సరిహద్దులు దాటుతోందని అన్నారు. మీ ఎంపీలు పార్లమెంటులో పోరాడరు…మీరు జంతర్ మంతర్ వద్ద దీక్షకు రారు. ఎన్నికలప్పుడు హక్కుల గురించి గొంతు చించుకోవడం… ఎన్నికలయ్యాక వాటిని మర్చిపోవడం మీకు అలవాటుగా మారిందని లేఖలో రేవంత్ పేర్కొన్నారు. మీ ఎంపీలు పార్లమెంటుకు వస్తారా రారా… మీరు జంతర్ మంతర్ దగ్గర దీక్షకు వస్తారా రారా… స్పష్టం చేయండన్నారు రేవంత్.

Advertisement

తాజా వార్తలు

Advertisement