Saturday, January 11, 2025

TG | కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్.. బీజేపీ ఎంపీ పేషెంట్

సిరిసిల్లలో ఆసక్తికర సన్నివేశం
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నిత్యం విమర్శలు చేసుకునే కాంగ్రెస్, బీజేపీ ప్రజా ప్రతినిధులు ఒక్క‌సారిగా డాక్టర్, పేషెంట్ గా మారిపోయారు.

సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి బీపీ చెక్ చేసి పరీక్షలు నిర్వహించారు. ఈ ఆసక్తికర సన్నివేశాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆసక్తిగా తిలకించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement