తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల కానుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో విడుదలకు సమయం ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే ఆరు హామీల పేరుతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్… మేనిఫెస్టో విడుదల చేసి.. ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అలాగే తులంతోపాటు కల్యాణలక్ష్మికి కూడా బంగారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్ లో మేనిఫెస్టోను విడుదల తర్వాత మేనిఫెస్టోలోని అంశాలను వివరించనున్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుద్యోగులకు భరోసా కల్పించేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని హస్తం నేతలు అంటున్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో అంశాలు ఇవే..!
- సిటిజన్ చార్ట్ కి చట్టబద్దత
- ధరణీ స్థానంలో భూ భారతి పోర్టల్
- పసుపు కుంకుమ పథకం కింద ఒక లక్షతో పాటు తులం బంగారం
- తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి సన్న బియ్యం పంపిణీ
- అమ్మ హస్తం పథకం పేరుతో 9 నిత్యావసర సరుకుల పంపిణీ
- ఆర్ఎంపీలకు గుర్తింపు కార్డు
- రేషన్ డీలర్లకు గౌరవ వేతనం
- వార్డు సభ్యులు గౌరవ వేతనం
- ఎంబీసీ లకు ప్రత్యేక కార్పొరేషన్
- ట్రాన్స్ జెండర్లకు ఆటోలు ,ప్రత్యేక సంక్షేమ పథకాలు
- జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకం