నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 26 (ప్రభ న్యూస్) : రూరల్ మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు, నాయకులు మంగళవారం రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నివాసంలో ఆయనను కలిశారు. అనంతరం జాలాల్ పూర్ గ్రామానికి చెందిన 52మంది కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ వారిని శాలువా కప్పి ఆహ్వానించారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ నుండి నలుగురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
రోజురోజుకు పెరుగుతున్న బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు..
కేసీఆర్ పాలనలో అన్నివర్గాలకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు.
డిచ్ పల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన నలుగురు బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. ఈసందర్భంగా జలాల్ పూర్, గొల్లపల్లి గ్రామాల యువకులు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా పాలిస్తున్నదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ ప్రగతిశీల ఆలోచనా విధానానికి తామంతా ఆకర్షితులమై బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ దార్శనిక పాలనతో ప్రతి పల్లెకూ అభివృద్ధి ఫలాలు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలు…
నిజామాబాద్ రూరల్ మండలంలోని జలాల్ పూర్ కు చెందిన లక్ష్మణ్, ఎండి షాదుల్లా కే సతీష్, ఎస్కే రఫీక్ జి దత్తాత్రి జే విజయ్ కుమార్, ఎండి సాజిత్, జి.సాయికుమార్, రాజు హరీష్, సాయిలు, కే.శ్రీనివాస్, కే నాగరాజ్, ఈ గంగాధర్ ఈ సంజీవ్, ఎం రాము, ఎం లక్ష్మణ్, ఎం నవీన్ ఈ సుధాకర్, ఈ లక్ష్మణ్, కె నారాయణ, ఈ శంకర్, మనోహర్, కే లక్ష్మణ్, ఎస్కే షారుక్ ఖాన్, ఎండి సాజిత్, జె వినయ్, ఎం శ్రీను, ఈ వడ్డెన్న, ఈ శ్రీనివాస్, చిన్న వడ్డెన్న, ఎం శ్యాము, బి భూషణ్, రవికుమార్, ఆటో రాజు, టి సురేష్, జి గంగాధర్, ఈ రాజు, ఎం శ్రీకాంత్, ఈ నాగరాజు, ఎస్ లక్ష్మణ్, ఈ రఘువీర్, గొల్లపల్లి గ్రామానికి చెందిన పెద్దల రాజు, మారం సాయిలు, కే సాయన్న, మేకల శ్యామ్ రావు, తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మండల జడ్పిటిసి సుమలత గోపాల్ రెడ్డి, కెసిఆర్ సేవాదళ్ కన్వీనర్ కొర్వా దేవేందర్, మండల పార్టీ అధ్యక్షులు చింతo శ్రీనివాస్ రెడ్డి, గొల్లపల్లి సర్పంచ్ లింగం యాదవ్, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, మండల నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.