భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. సోమవారం కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన పాల్వంచలో పర్యటించారు. వనమా రాఘవ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి న్యాయం జరిగేవిధంగా పోలీస్ అధికారాలు చిత్తశుద్ధితో విచారణ జరిపించాలని కోరారు. వనమా వెంకటేశ్వరరావును తక్షణమే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తండ్రి పదవి అడ్డం పెట్టుకొని రాఘవ అరాచకాలు 30 సంవత్సరాలుగా చేస్తున్నాడని ఆరోపించారు.
ఈ విషయంపై డిజిపి పూర్తి స్థాయిలో న్యాబద్ధమైన విచారణ జరిపించాలన్నారు. రాఘవను జైలు నుండి బయటకు రాకుండా చూసి విచారణ జరిపించాలన్నారు. బయటకు వస్తే బాధితులను ప్రభావితం చేస్తాడని వనమా వెంకటేశ్వరరావును మొదటి ముద్దాయిగా చేర్చి పదవి నుండి తొలగించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital