Tuesday, November 26, 2024

కేసులు తక్కువ చూపడానికే టెస్టులు చేయట్లేదు: కాంగ్రెస్

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ అసమర్థతతో ప్రజలు ప్రాణాలు పోతున్నాయని ధ్వజమెత్తారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సీఎం కేసీఆర్‌ దిక్కుమాలిన స్కీం అన్నారని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో కరోనాకు ఉచిత ట్రీట్మెంట్ ఇస్తున్నారని, తెలంగాణలోనూ కరోనాకు ఉచితంగా వైద్యం అందించాలని ఉత్తమ్‌ డిమాండ్ చేశారు. నామమాత్రపు ఫీజుతో అంబులెన్స్ సర్వీసులు అందించాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్లు లేవని, వాక్సినేషన్ ఎందుకు ఆగిపోయిందో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని కాంగ్రెస్ నేత జీవన్‌ రెడ్డి విమర్శించారు. ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వం లాలూచీ పడుతోందని ఆరోపించారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికట్టే జీవో అమలు కావట్లేదన్నారు. కేసుల సంఖ్య తక్కువ చూపడానికే టెస్టులు చేయట్లేదని తెలిపారు. కరోనా, బ్లాక్ ఫంగస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని జీవన్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement