Friday, November 22, 2024

పేదల రక్తం తాగుతున్నారు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ ఫైర్

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పేదల రక్తం తాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణ రావు ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయ అధికారరికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్,డీజిల్,పెట్రోల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలతో దోపిడీ చేస్తోందని ఆక్షేపించారు. పెట్రోల్, డీజిల్,గ్యాస్ పై రాష్ట్ర ప్రభుత్వ పన్ను మినహాయింపు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పే టిఆర్ఎస్ ప్రభుత్వం.. అధికారంలో ఉండి ధర్నా, రాస్తారోకోలు నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంపై మాటలు చెబుతూ రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. రైతు రుణమాఫీ ముచ్చటే టిఆర్ఎస్ ప్రభుత్వం మార్చిపోయిదని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement