అస్సాం సీఎం హేమంత్ బిశ్వాస్శర్మ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కమిషనరేట్ల ఎదుట ధర్నా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైయ్యారు. పెద్దపెల్లి కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కాంగ్రెస్ నాయకులు రామగుండం కమిషనరేట్ ఎదుట ధర్నా నిర్వహించేందుకు బయలుదేరుతుండగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పెర్క శ్యామ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జగదీశ్, ఉపాధ్యక్షులు వేముల రాజు, సయ్యద్ ఫయాజ్ లను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement