Wednesday, November 20, 2024

సీజేఐ ఎన్.వి రమణకు కాంగ్రెస్ నేత వీహెచ్‌ లేఖ

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు లేఖ రాశారు. హజీపూర్ లో ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం చేసి, హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి కేసు ఏడాదిన్నరగా హైకోర్టులో పెండింగ్ లో వున్న విషయాన్ని సీజీఐ దృష్టికి తెచ్చారు.

రెండేళ్ల క్రితం హజీపూర్ హత్యల ఘటన రెండు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. వీటి లింకులు కర్నూలు వరకు వెళ్లాయి. ఒంటరి అమ్మాయిలు, మహిళలను టార్గెట్ చేసి, వారిని బైక్ పై ఎక్కించుకుని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి, అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన కేసుల్లో శ్రీనివాస్ రెడ్డిని కింది కోర్టు దోషిగా తేల్చి, ఉరిశిక్ష విధించింది. అయితే, హైకోర్టులో ఈ కేసు ఏడాదిన్నరగా పెండింగ్ లో ఉంది. కేసు పెండింగ్ లో ఉన్న విషయాన్ని సీజేఐ దృష్టికి వీహెచ్ తీసుకెళ్లారు. శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లోయర్ కోర్ట్ తీర్పు ఇచ్చినా హైకోర్టులో ఏడాదిన్నరగా కేసు పెండింగ్‌లో ఉందని వీహెచ్‌ లేఖలో పేర్కొన్నారు. 

ఈ వార్త కూడా చదవండిః వైరల్ అయిన ఆడియోపై మంత్రి అవంతి వివరణ

Advertisement

తాజా వార్తలు

Advertisement