కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసిన తర్వాతే కొత్త టీ.పీసీసీ కమిటీపై తాను మాట్లాడతానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. తన ఆరోగ్యం విషయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాటు ఇతర నాయకులందరూ తనను పరామర్శించారని వీహెచ్ తెలిపారు. తనను పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. బడుగు బలహీన వర్గాల వాళ్లకి తన సేవలు అవసరమని మా సోనియాగాంధీ చెప్పారని తెలిపారు. సోనియా గాంధీ మాట్లాడటం వల్ల తనలో దైర్యం పెరిగిందన్నారు.
రాజకీయాల్లోకి సేవ చేయాలని వచ్చానని, అంతే తప్ప డబ్బులు సంపాదించడానికి రాలేదన్నారు. తన మిగతా జీవితం అంతా బడుగు బలహిన వర్గాలకి సేవ చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తమ నాయకురాలు సోనియా గాంధీని కలిసిన తరువాత కొత్త కమిటీ, పాత కమిటీ గురించి మాట్లాడతానని చెప్పారు. అప్పటివరకూ ఏమీ మాట్లాడనని వీహెచ్ స్పష్టం చేశారు. ‘‘ఎక్కడ పేదవారికి ఆపద ఉన్నా ఆదుకునే పవన్ కళ్యాణ్.. నా ఆరోగ్య విషయంలో లెటర్ రాశారు’ అని చెప్పిన వీహెచ్.. పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వి.హనుమంతరావు 24 రోజుల తర్వాత ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత రేవంత్‌రెడ్డి… ఆసుపత్రిలో వీహెచ్‌ను కలిసి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రేవంత్‌రెడ్డి.. వీహెచ్ నుంచి విలువైన సలహాలు, సూచనలు స్వీకరించారు. ఇక, సోనియా గాంధీ ఫోన్ లో వీహెచ్ తో మాట్లాడారు.ఆయన త్వరగా కోలుకోలాని ఆకాంక్షించిన సంగతి తెలిసిందే.