Tuesday, November 19, 2024

ఈటల సరే.. మిగతా వారి సంగతేంటి?

భూకబ్జా ఆరోపణలతో ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వంలో ఉన్న మరికొంత మంది మంత్రులపై వచ్చిన ఆరోపణలపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు.  అవినీతిపై సీఎం కేసీఆర్ స్పీడ్‌ గా విచారణ జరిపించడం సంతోషించదగ్గ పరిణామన్నారు. అయితే, అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు ఉన్నాయని.. వాళ్లపై ఎందుకు చర్యల్లేవని ప్రశ్నించారు. . ఈటలను తాము వెనకేసుకు రావడం లేదని, అందరిపై ఇలాగే చర్యలు తీసుకోవాలన్నారు. ఈటల తప్పు చేస్తే శిక్షించాల్సిందేని వీహెచ్ స్పష్టం చేశారు. మంత్రి మల్లారెడ్డి మీద ఎన్నో బెదిరింపులు, భూకబ్జాల ఆరోపణలు ఉన్నాయని అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని వీహెచ్  ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కబ్జాల గురించి ఎందుకు చర్యలు లేవన్నారు. ఒక్కొక్కరికి ఒక్కక్క న్యాయమా? అని మండిపడ్డారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పైన చర్యలు తీసుకున్నట్లేచ మిగత వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సీఎంకి లేఖ రాస్తానని, మిగిలిన వారి పైన చర్యలు తీసుకోకపోతే తాము పోరాటం చేస్తామని చెప్పారుఈటల సరే..  మిగతా వారి సంగతి ఏంటి? 

Advertisement

తాజా వార్తలు

Advertisement