Thursday, November 21, 2024

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత ప్రశంసలు.. దళిత బంధుకు మద్దతు

హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంటే.. ఆదే పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత మాత్రం పథకం అద్భుతం అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్‌‌పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన  దళితబంధు పథకం గొప్ప కార్యక్రమం అని ఆయన అన్నారు. కేసీఆర్ నిర్ణయానికి తాను మద్దతు పలుకుతున్నానని చెప్పారు. దళితబంధు పథకంతో రాష్ట్రంలోన 25 లక్షల దళిత కుటుంబాలకు మేలు కలుగుతుందని చెప్పారు. ఈ పథకం మూలంగా దళితుల జీవితాలు బాగుపడతాయన్నారు. దళితబంధుపై రాజకీయాలు చేయటం తగదన్నారు. దళిత వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి అందరూ మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని సర్వే సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.

కాగా, సర్వే చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. సర్వే టీఆర్ఎస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే ఊహాగానాలు మొదలైయ్యాయి.

ఇది కూడా చదవండిః హుజురాబాద్ లో వారే న్యాయ నిర్ణేతలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement