హుజురాబాద్ ఉపఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికల మారిందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. అధికార పార్టీ ఓటర్లను అన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. లక్ష 50 వేల మందికి 3 గంటల్లో 90 కోట్ల రూపాయలను పంపిణీ చేశారని సంచలన ఆరోపణ చేశారు. శశాంక్ గోయల్ అధికారులకు చెప్పక ముందే అన్ని పనులు అయిపోయాయని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా ఒక సీనియర్ అధికారిని పంపించి చర్యలు తీసుకోవాలి ఈసీని కాంగ్రెస్ తరుపున విజ్ఞప్తి చేశారు.
ఇటీవల సీఎం కేసీఆర్ ఎన్నికల కమిషన్ ను హెచ్చరించారని, శశాంక్ గోయల్ ఆ మాటలు విన్న కూడా ఏమి చేయలేదని మండిపడ్డారు. ఎన్నికల ప్రధాన అధికారియే ఏమి చేయకపోతే ఇక జిల్లా స్థాయి అధికారులు ఏం చేస్తారని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: ఏపీ సీఎం జగన్‌ను కలిసిన నాగార్జున.. ఏం మాట్లాడారు?