Saturday, November 23, 2024

టీ.పీసీపీ చిచ్చు: ఆ పదవికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా!

కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపీ రేవంత్ రెడ్డిని టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమించిన అనంతరం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వడంతో కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించే సాహసం చేయనప్పటికీ, తమ అసంతృప్తిని మాత్రం ఏదో ఒక రూపంలో వెళ్లగక్కుతున్నారు.

ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇకపై తాను గాంధీ భవన్ మెట్లు ఎక్కనని స్టేట్ మెంట్ ఇచ్చారు.  తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు. నూతన సమన్వయ కమిటీ ఏర్పాటులో టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పూర్తిగా సహకరిస్తామని శశిధర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని, ఎప్పటికీ కాంగ్రెస్ వాదిగానే ఉంటానని ఉద్ఘాటించారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్ లో టీ.పీసీసీ అగ్గి.. రాజీనామా బాటలో సీనియర్లు!

Advertisement

తాజా వార్తలు

Advertisement