కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ పై టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అంశంపై తెలంగాణ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ స్పందించారు. సుపారి జర్నలిస్టులు అంటూ మండిపడ్డారు. ఆఫ్ ది రికార్డు మాటలను రికార్డు చేసి… అధికారంలో ఉన్న కీలక నేతలకు పంపిన వారి సుపారీ జర్నలిస్టులు అనకుండా ఇంకేమంటారు అని ట్వీట్ చేశారు.
పార్లమెంటరీ ఐటీ స్థాయీ సంఘం చైర్మన్ హోదాలో ఇటీవల హైదరాబాద్ వచ్చిన శశిథరూర్ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. దీంతో శశిథరూర్ మండిపడ్డారని ఆయనపై అనుచిత పదం ఉపయోగించారని ఓ ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది. దీనిపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పెద్దలను గౌవరించని వ్యక్తిని పీసీసీ అధ్యక్షుడిగా చేశారని విమర్శించారు.
అయితే, రేవంత్ ఈ వివాదంపై స్పందించారు. ఎంపీ శశిథరూర్ పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్టు రేవంత్ తెలిపారు. తాను అత్యంత గౌరవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శశిథరూర్ మాత్రమేనన్నారు. తన వ్యాఖ్యలపై శశిథరూర్‌కు వివరణ ఇచ్చినట్టు చెప్పారు. కాంగ్రెస్‌లో అందరూ విలువలు, విధానాలతో పనిచేస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: శశిథరూర్ కి రేవంత్ క్షమాపణ.. కాంగ్రెస్ ఎంపీ ఏమన్నారంటే..