టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అసభ్య పదజాలంతో దుర్భాషలాడంటం కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఓ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బజారు మనిషి లా ప్రవర్తించడం మల్లారెడ్డికే చెల్లిందని విమర్శించారు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. రాష్ట్ర చరిత్రలో కనీసం వార్డు మెంబర్ స్థాయి వ్యక్తి కూడా ఇలా మాట్లాడి ఉండడు అని ఎద్దేవా చేశారు. గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉండి నీచమైన పదజాలాన్ని ఉపయోగించి ఆ మంత్రి పదవికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని మండిపడ్డారు హరివర్ధన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి మంత్రి పదవిలో ఉండడం మన దౌర్భాగ్యమని…తక్షణమే మల్లారెడ్డిని తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఇక మంత్రి వ్యాఖ్యలను పై ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇక నిరసనగా మంత్రి దిష్టిబొమ్మలను తగలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి మండల స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో, కార్పొరేషన్ స్థాయిలో, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని హర్షవర్ధన్ రెడ్డి సూచించారు.
ఇది కూడా చదవండి: వ్యాక్సిన్ తీసుకోనివారికి షాకింగ్ న్యూస్..