Friday, November 22, 2024

టీపీసీసీ రేసులో శ్రీధర్ బాబు… అధిష్టానం నిర్ణయమేంటి?

తెలంగాణ పీసీసీ చీఫ్‌ గా కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని ఎంపిక చేసింది అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ.. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టీపీసీసీ రేసులో లేనని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పార్టీలో ఎవరికి పీసీసీ ఇచ్చినా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. కేసుల మాఫీ కోసం కొందరు బీజేపీ వైపు చూస్తున్నారని, బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో ఎందుకు చేరారో ఆయనే చెప్పాలని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.  తెలంగాణ ప్రభుత్వ భూముల అమ్మకానికి తెచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.  ఆర్థికలోటు పూడ్చుకోవడానికి భూములు అమ్మడం సరికాదన్నారు. 

కాగా, త్వరలో టీపీసీసీకి కొత్త చీఫ్‌ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. ఇప్పటికే పార్టీ నేతల అభిప్రాయాలను సైతం సేకరించింది. అధ్యక్షుడి ప్రకటనపై ఇదిగో అదిగో అంటూ ఇన్నాళ్లు దాటవేస్తూ వచ్చారు. పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి, కొమటి రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి సహా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement