Wednesday, November 20, 2024

తెలంగాణ సీఎస్ కు దామోదర రాజానర్సింహ లేఖ

తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం పంప్ హౌస్ నుండి బ్యారేజీకి నీటిని తరలించే పైప్లైన్లు ఇటీవల కాలంలో దెబ్బతిన్నాయని వార్తలు వస్తున్నాయని తెలిపారు. పైప్ లైన్ లో నాణ్యతా లోపాలు, హడావుడి పనులు, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇదంతా జరిగినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. పైప్ లైన్ లు వేసే ముందు నీటిని అవి తీసుకునే సామర్థ్యం, నీటి వెలాసిటీ, భూమి పొరల స్థితి, వేయాల్సిన లోతు, తదితర వివరాలను దృష్టిలో పెట్టుకొని వేయాల్సి ఉంటుందని చెప్పారు. స్థానికంగా పైపైన్ వెళ్లే మార్గంలో ఏవైనా వాగులు, వంకలు వెళితే వాటిని ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవేమీ పట్టింపు లేని కారణంగా ఒక పైపు భూమిని చీల్చుకుని పైకి రాగా, అది ఏ క్షణమైనా పగిలే అవకాశం ఉందని తెలిపారు. వేసిన పైపులన్నీ అదే పరిస్థితిలోనే ఉన్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కొన్ని ముఖ్య విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. తాము పేర్కొన్న విషయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్నారం పంప్ హౌస్ నిర్మాణం వ్యయం ఎంత ? దానిలో ఎన్ని మోటార్లు అమర్చారని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement