Sunday, November 24, 2024

Congress – ఎందుకు ఆ లోక్ స‌భ‌ స్థానాలు గెలుచుకోలేక‌పోయాం ? : కురియన్ కమిటీ పోస్టుమార్టం

హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై కురియన్ కమిటీ పోస్టుమార్టం మొదలైంది. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలుండగా కాంగ్రెస్ 8, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంది. పార్లమెంటు ఫలితాల్లో ఓటమికి కారణాలను తెలుసుకునేందుకు రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ కురియన్ నేతృత్వంలోని వేసిన త్రిసభ్య కమిటీ నేడు గాంధీ భవన్ లో చేరుకున్న కమిటీ నియోజకవర్గాల వారీగా విడివిడిగా అభ్యర్థులతో ఓటమికి గల కారణాలపై ఆరా తీస్తోంది. కురియన్‌తో పాటు రకీబుల్‌ హుస్సేన్, పర్గత్‌సింగ్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మూడు రోజుల పాటు వరుస భేటీలు ఉండనున్నాయి.

ముందుగా సికింద్రాబాద్ సెగ్మెంట్ లో ఓటమికి గల కారణాలపై కమిటీ ఆరా తీసింది. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఈ కమిటీతో భేటీ అయ్యారు. తర్వాత హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థి సమీర్ ఉల్లాతో కురియన్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మాట్లాడింది. మల్కాజ్ గిరి, చేవెళ్లలో ఓటమికి కారణాలపై అభ్యర్థులు సునీతా మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిని అడిగి తెలుసుకుంది. వరంగల్ ఎంపీ కడియం కావ్యతోనూ కమిటీ మాట్లాడింది. విజయానికి దోహదపడ్డ అంశాలపై ఆమెతో చర్చించింది. ఇక మెదక్, మహబూబ్ నగర్ అభ్యర్థులు నీలం మధు, వంశీచంద్ రెడ్డితోనూ కమిటీ మాట్లాడనుంది.

- Advertisement -

ఇది శుభపరిణామం: దానం

గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఏ రాజకీయ పార్టీలో కూడా ఇలాంటి పద్ధతి లేదని, ఇది కొత్త విధానమని అన్నారు. జరిగిన లోపాలు సరిదిద్దు కోవడానికి మంచి అవకాశమని చెప్పారు. తన ఓటమికి కొన్ని పొరపాట్లు జరిగాయని, వాటిని కురియన్ కమిటీకి తెలియజేశానని అన్నారు.

అసెంబ్లీ సెగ్మెంట్లు రిపోర్ట్ ఇచ్చాను: కావ్య

కురియన్ కమిటీ గెలిచిన, ఓడిన అభ్యర్థులతో సమావేశమైందని వరంగల్ ఎంపీ కడియం కావ్య చెప్పారు. పలుచోట్ల ఓటమికి కారణాలు అడగార‌న్నారు.. బీఆర్ఎస్ ఓటు బీజేపీకి టర్న్ అయ్యిందనట్లు చెప్పానన్నారు. తాను లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నివేదిక ఇచ్చానని తెలిపారు. పార్టీ బలహీనంగా ఉన్నచోట ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కురియన్ అడిగారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement