Friday, November 22, 2024

TS | సీడబ్ల్యూసీ భేటీకి కాంగ్రెస్ సిద్ధం.. 17న భారీ బహిరంగ సభ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ( సీడబ్ల్యూసీ) సమావేశాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణ గడ్డపై తొలిసారిగా రెండు రోజుల ( 16, 17 తేదీల్లో) పాటు హైదరాబాద్‌ వేదికగా తాజ్‌కృష్ణా హోటల్‌లో జరిగే ఈ కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశాలకు.. కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, , ముఖ్యమంత్రులు, ఏఐసీసీ ప్రధాన కార్యర్శులు, కేంద్ర మాజీ మంత్రులు, ఇతర సీనియర్లతో కలిపి దాదాపుగా 200 మందికి పైగా ప్రతినిధులు సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఇప్పటీ వరకు ఢిల్లిdలోని ఏఐసీసీ కార్యాలయం వార్‌రూమ్‌లో జరిగే ఈ సమావేశం.. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుండటంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

పార్టీ అగ్రనాయకత్వం అంతా రాష్ట్రానికి రావడం, కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నతంగా భావించే సీడబ్ల్యూసీ సమావేశాలు తెలంగాణలో నిర్వహిస్తుండటంతో.. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటుంది. ఏమాత్రం లోటుపాట్లు లేకుండా పకడ్బందిగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో వీఐపీకి పీసీసీ నుంచి ఒక డెలిగెట్‌ను ఏర్పాటు చేశారు. ఏయిర్‌పోర్టు నుంచి దిగినప్పటికి నుంచి సమావేశానికి హాజరకావడం, తిరిగి వెళ్లే వరకు పీసీసీ కేటాయించిన నాయకులు చూసుకునే విధంగా కార్యాచరణ తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2005లో కాంగ్రెస్‌ అధిష్టానం ఏఐసీసీ ప్లీనరీని నిర్వహించింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు మొదటిసారిగా సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా, శనివారం మధ్యాహ్నాం తర్వాత 2:30 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కానుంది. మొదటి రోజు జరిగే ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు సీడబ్ల్యూసీ శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే హాజరవుతారు. తెలంగాణ నుంచి సీడబ్ల్యూసీ సభ్యులుగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డికి అవకాశం దక్కనుంది. ఈ సమావేశంలోనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ తీసుకునే నిర్ణయాలను చర్చించనున్నారు. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఏర్పాటైనా ఇండియా కూటమితో అనుసరించే వ్యూహాలు, తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలు లేదంటే జమిలి ఎన్నికలు వస్తే ఎలా వ్యవహారించాలనే అంశాలపైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

కాగా, రెండో రోజు ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఏఐసీసీ ప్రధానకార్యదర్శులు, ఏఐసీసీ కార్యదర్శులు, కేంద్ర మాజీ మంత్రుల, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులతో పాటు పార్టీ సీనియర్లు పాల్గొననున్నారు. మొదటి రోజు తీసుకున్న నిర్ణయాలతో పాటు, అదనంగా మరికొన్ని అంశాపై చర్చిస్తారని సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్‌ అగ్రనేతలందరు హాజరుకానున్నారు.

ఐదు గ్యారంటీలు, గాంధీ ఐడియాలజీ సెంటర్‌ ప్రారంభం..
కాంగ్రెస్‌ పార్టీ అత్యుతన్నతంగా భావించే సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత తుక్కుగూడలో నిర్వహించే విజయభేరి సభకు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్లు ఒకే వేదికపైన ఆశీనులు కానున్నారు. ఈ బహిరంగ సభలోనే కర్ణాటక రాష్ట్రంలో ప్రకటించిన విధంగా 5 గ్యారంటీలను సోనియాగాంధీ ప్రకటించనున్నారు. దీంతో పాటు సికింద్రాబాద్‌ బోయినపల్లిలోని రాజీవ్‌గాంధీ ఐడియాలజీ సెంటర్‌ను కూడా అక్కడి నుంచే సోనియాగాంధీ ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

నియోజక వర్గాల్లోనే ఇన్‌చార్జ్‌ల బస.. 18న గ్యారంటీ కార్డుల పంపిణి..
తుక్కుగూలో నిర్వహించే విజయభేరి సభలో ప్రకటించే ఐదు గ్యారంటీ కార్డులను సోమవారం రోజున అసెంబ్లిd నియోజక వర్గాల్లో పంపిణి చేయనున్నారు. అందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్లకు.. ఒక్కో నియోజక వర్గానికి బాధ్యతలు అప్పగించారు. నియోజక వర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించబడిన నాయకులు విజయభేరి సభా అనంతరం వారికి కేటాయించిన నియోజక వర్గాలకు వెళ్లి బస చేయనున్నారు. 18న గ్యారంటీ కార్డులను ప్రారంభించనున్నారు. ప్రతి ఇంటికి గ్యారంటీ కార్డులు పంపిణి చేసి.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులను వివరించి.. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా కార్యాక్రమాలు చేయనున్నారు.

విజయభేరి సభా విజయానికి సన్నాహక సమావేశాలు..
ఈ నెల 17న తుక్కుగూడలో నిర్వహించే విజయభేరి సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులందరూ జిల్లాల బాట పట్టారు. 10 లక్షల మందిని తరలించాలని పీసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకు ఒక్కో ముఖ్య నాయకుడికి ఐదు అసెంబ్లిd నియోజక వర్గాల చొప్పున ఇన్‌చార్జ్‌ బాధ్యతలను అప్పగించారు. ఇన్చార్జ్‌గా నియమించన నియోజక వర్గాలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమర్క, సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనరసింహ, వంశీచంద్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షులు వి. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు.. వారికి కేటాయించిన అసెంబ్లిd నియోజక వర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి అసెంబ్లిd నియోజక వర్గం నుంచి భారీగా జన సమీకరణ చేయాలని సూచిస్తున్నారు.

కాంగ్రెస్‌ అగ్రనేతలకు పీసీసీ చీఫ్‌ లంచ్‌.. రుచికరమైన తెలంగాణ వంటకాలు..
సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహణ మొత్తం ఏఐసీసీ పరిధిలోనే జరగనుంది. ఇందులో రాష్ట్ర పార్టీ ప్రమేయం లేకుండా కాంగ్రెస్‌ అధిష్టానం చూస్తోంది. అయితే 16న మధ్యాహ్నాం తాజ్‌ కృష్ణాలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు మధ్యాహ్నా భోజన కార్యక్రమాన్ని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ గడ్డపై జరుగుతుండటంతో రుచికరమైన వంటకాలను అందించేందుకు కాంగ్రెస్‌ నేతలు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ సంబంధించి హైదరాబాద్‌ బిర్యానీతో పాటు 100కు పైగా వంటకాలకు అందించాలని నిర్ణయించారు. అంతే కాకుండా ఇక్కడికి వచ్చే నాయకులకు సీడబ్ల్యూసీ సమావేశాల గుర్తుగా చార్మినార్‌తో కూడిన నమూనాలను బహుకరించాలని నిర్ణయించినట్లుగా తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement