న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాజ్యాంగ ఫలాలు దళితులకు దామాషా ప్రకారం అందటం లేదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 28 ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాటం జరుగుతోందని చెప్పుకొచ్చారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు.
ఎన్నికల సమయంలో వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ, టీఆరెస్‌లు హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా సంపత్ గుర్తు చేశారు. ఏఐసీసీ ముఖ్యనాయకులైన కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్‌లను కలిశానని చెప్పారు. ఆగస్టు 6న జంతర్ మంతర్‌లో తెలంగాణ దళితుల ధర్నా చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. అత్యధిక జనాభా ఉన్న మాదిగలను బీజేపీ, టీఆరెస్‌లు విస్మరిస్తున్నాయని సంపత్ విమర్శించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.