Wednesday, December 4, 2024

TG | కాంగ్రెస్ ది ప్రజా సర్కార్ : ఎమ్మెల్యే వివేక్

చెన్నూర్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన చేపడుతుందని చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ రోజు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి సాయత్రం హాజరై మాట్లాడారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం మూడు లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పరని వాస్తవానికి ఏడు లక్షల కోట్ల అప్పుచెసి రాష్ట్రాన్ని అంధకారం లోకి నెట్టేసిందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉందని అన్నారు.

రెండు లక్షలకు పైగా ఉన్న రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. చెన్నూరు పట్టణంలో పదికోట్ల తో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్ నవాజ్, కౌన్సిలర్లు రేవెల్లి మహేష్, పోగుల సతీష్ పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement