హుజూరాబాద్ ఓటమితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దూమారం రేపింది. ఎన్నికల్లో వచ్చిన ఓట్లు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ఇప్పటికే కొందరు నేతలు టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇటీవల ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేం సాగర్ రావు వంటి కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. టీ.కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. హైకమాండ్ పిలుపుతో నేతల్లో అలజడి మొదలైంది. హుజూరాబాద్ ఓటమి పైనే ప్రధాన చర్చ జరుగుతుందని సమాచారం. హుజురాబాద్ లో కేవలం 1.46 ఓట్లకే పరిమితం అవ్వడంతో ఏఐసీసీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 13న కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్నికలో ఓటమి గల కారణాలను అధిష్టానం ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ ఓటమిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని ఇటీవల ఎంపీ కోమటిరెడ్డి ప్రకటించారు. పీసీసీ చీఫ్ రేవంత్ పై గుర్రుగా ఆయన.. ఉపఎన్నికలో ఓటమికి ఆయననే నైతిక బాధ్యత వహించాలని కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: Breaking: పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్!
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily