Tuesday, November 26, 2024

Congress – బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కూడా పనికిరాదు – డిప్యూటీ సీఎం భట్టి

తుక్కు గూడ – ఫోన్ ట్యాపింగ్‌తో దేశ భద్రతకు ప్రమాదం తెచ్చారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. దేశ భద్రతకు వాడాల్సిన కమ్యూనికేషన్‌ను గత పాలకులు వ్యక్తిగతంగా వినియోగించారని మండిపడ్డారు.

ఈ వ్యవహారంపై పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు భట్టి తెలిపారు. గురువారం ఆయన తుక్కుగూడలో సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.తుక్కుగూడలో జరిగే జన జాతర సభ దేశానికి దిదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దిక్కు కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. అవాస్తవాలు మాట్లాడే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కూడా పనికిరాదని భట్టి ఎద్దేవా చేశారు.

పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు.. గత పాపాలకు బాధ్యత లేదంటే ఎలా అని భట్టి నిలదీశారు. జూన్ మాసంలో వచ్చిన వర్షాలను కేసీఆర్ ఒడిసి పట్టలేదని, అవసరం లేకున్నా గొప్పల కోసం నాగార్జున సాగర్ నీటిని కిందికి వదిలారని మండిపడ్డారు. నిర్మాణ లోపంతో కాళేశ్వరంలో గోదావరి నీటిని కిందికి వదలాల్సి వచ్చిందన్న భట్టి విక్రమార్క.. కేసీఆర్ తప్పిదాల వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలులో ఒక్కరోజు ఆలస్యమైనా ఆలస్యమేనని భావించి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తెచ్చామని చెప్పుకొచ్చారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కేసీఆర్ ఫాంహౌస్‌లో మూడు నెలలు పడుకొని బయటికి వచ్చి, కరెంటు లేదంటూ మాట్లాడుతున్నారని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు

తుక్కుగూడలో జరిగే జన జాతర సభ దేశానికి దిశా నిర్దేశం చేయబోతోందన్నారు డిప్యటీ సీఎం భట్టి. దేశంలోనే తుక్కుగూడ సభ చారిత్రాత్మకం కానుందని, లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను జన జాతర సభ నుంచే ఏఐసీసీ ప్రకటించనుందని పేర్కొన్నారు.

- Advertisement -

మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ కేసుపైనా స్పందించారు. దేశ భద్రతకు వాడాల్సిన కమ్యూనికేషన్ వ్యవస్థను, గత పాలకులు వ్యక్తిగత అవసరాలకు వినియోగించారని దుయ్యబట్టారు. వ్యక్తిగత కుటుంబ జీవితాలు, వ్యాపారులు, అధికారులు, జడ్జీలు ఏం మాట్లాడుకుంటున్నారో నిబంధనలకు విరుద్ధంగా విన్నారని మండిపడ్డారు

.
.

భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు పనికిరాని సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడారని మండిపడ్డారు. డిస్కంలు, జెన్‌కోలు బీఆర్ఎస్ పాలనలో కుప్పకూలిపోయాయని దుయ్యబట్టారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు, వరంగల్ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు తుక్కుగూడ సభకు కదలి రావాలని పిలుపునిచ్చారు భట్టి. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తుందో, తెలంగాణ మోడల్‌గా తుక్కుగూడలో ఏఐసీసీ నాయకత్వం సందేశం ఇవ్వబోతోందని భట్టి తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement