హుజురాబాద్ ఎన్నికలు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు గురువారం సాయంత్రం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆధ్వర్యలో కాంగ్రెస్ నేతలు ఈసీని కలువనుంది. అడ్డగోలుగా అక్రమాలు, ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ హుజురాబాద్ లో ఓటర్లను టిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కొనుగోలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపణ చేసింది. ఓటుకు 6 వేల రూపాయల నుంచి 10 వేల వరకు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తున్నారని ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నారు. బహుమతులు, ప్రలోభాలు, ఓట్ల కొనుగోలు, అధికార దుర్వినియోగం తదితర అక్రమాలు జరిగాయని తెలిపారు. మూడు గంటల్లో లక్షన్నర మంది ఓటర్లకు 90 కోట్ల రూపాయలు పంపిణీ జరిగిందని ఆరోపించారు. ఇంత ఘోరంగా విచ్చలవిడిగా అడ్డగోలు అక్రమాలు, ఎన్నికల నిబంధనల అతిక్రమణలు ఎక్కడా జరగలేదని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Corona: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్.. తస్మాత్ జాగ్రత్త