Tuesday, November 26, 2024

TS: వామపక్షాలకు నాలుగు సీట్లు.. కాంగ్రెస్ అంగీకారం..!

తెలంగాణలో కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీల పొత్తు అంశంపై కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణ‌యం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల కోసం రెడీ అవుతున్న కాంగ్రెస్ ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇదే టైమ్‌లో సీపీఎం, సీపీఐతో పొత్తులపైనా దృష్టిపెట్టింది.

తెలంగాణలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న హస్తం పార్టీ.. ఏ చిన్న అవకాశాన్ని వదులుకొవద్దని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే లెఫ్ట్‌ పార్టీలతో పొత్తుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీపీఐకి కొత్త‌గూడెం, మునుగోడు అసెంబ్లీ సీట్లు, సీపీఎంకు భ‌ద్రాచ‌లం, మిర్యాల‌గూడ సీట్లు కేటాయించిన‌ట్లు స‌మాచారం. పోడెం వీర‌య్య‌ను పిన‌పాక పంపాల‌ని కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. ఖ‌మ్మం నుంచి పొంగులేటి, పాలేరు నుంచి తుమ్మ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. సీపీఐ, సీపీఎం పార్టీ బ‌లాబ‌లాలపై స‌ర్వే చేయించిన త‌ర్వాత‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement