Saturday, November 16, 2024

రాష్ర్టంలో కర్ణాటక ఫలితాలే…ఎక్స్ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డీ

నిజమాబాద్ – రాష్ర్టంలో కర్ణాటక ఫలితాలే పునరావృత మవుతాయని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్సీ. నిజమాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి డాక్టర్ భూపతి రెడ్డీ జోస్యం చెప్పారు. ఆదివారం మండలంలోని మెగ్య నాయక్ తండాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాపి చేస్తామని హామీ ఇచ్చారు. వృద్దులకు.వితంతువులకు 4 వేల రూపాయల పించన్ అందిస్తామని అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి కోసం 5 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

మహిళలకు ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని రూరల్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి డాక్టర్ భూపతి రెడ్డీ అన్నారు.రైతులకు ఎకరానికి 15000 వేల రూపాయల పెట్టుబడి సహాయం అందించడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ భృతి.18 ఏళ్ళు దాటిన విద్యారథులందరికీ ఎలెక్ట్రానిక్ బైక్ పూర్తీ ఉచితంగా అందిస్తామని అన్నారు

ఆయన వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్.డిసిసి డెలిగేట్ వెంకట్ రెడ్డి.ఉపసర్పంచ్ బైరయా.అంబర్ సింగ్. బాబియ నాయక్.లారీ గంగా రెడ్డీ.తోట రాజన్న. సాయెందర్.తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement