Tuesday, November 19, 2024

హ‌రీష్ బ‌డ్జెట్ లో భారీ అంకెలే తప్ప బ‌డుగుల‌కు ఒరిగిందేమి లేదు – భ‌ట్టి

హ‌రీష్ బ‌డ్జెట్ లో భారీ అంకెలే తప్ప బ‌డుగుల‌కు ఒరిగిందేమి లేదు – భ‌ట్టి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో భారీ అంకెలు కనిపించాయి కానీ కొత్తేమి లేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తెలంగాణ బడ్జెట్‭లో అంకెలగారడి, మాయమాటలు తప్ప ఏమిలేవని అన్నారు. ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయం వచ్చేసరికి.. హామీలతోనే కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‭లో బలహీన వర్గాలకు ఒరిగిందేమీ లేదన్న భట్టి.. 8 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రుణమాఫీ ఎక్కడ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సందర్భం వచ్చిన ప్రతిసారి అధికార పార్టీ నేతలు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ, 5 గంటలు కూడా కరెంట్ రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లిక్కర్ ఆదాయం ఒక్కటే భారీగా కనిపిస్తోందని.. నిరుద్యోగ భృతి, గిరిజన బంధు ఏమైనాయని భట్టి నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ అని ప్రశ్నించారు. కృష్ణా జలాలకు సంబంధించి ప్రాజెక్టుల మాటే లేదని.. ఎవరో అధికారులు రాసిస్తే దాన్ని హరీష్ రావు చదివారని భట్టి ధ్వజమెత్తారు. విద్యార్థులను గాలికి వదిలేశారన్నారు. ఇక రుణమాఫీ నిధులు ఏమయ్యాయని ప్రభుత్వం పై భట్టి ప్రశ్నల వర్షం కురిపించారు.

జ‌ర్న‌లిస్ట్ ల ప్ర‌స్తావ‌న బ‌డ్జెట్ లో ఎక్క‌డ – జ‌గ్గారెడ్డి

హరీష్ రావు బడ్జెట్ పుస్తకం చాలా లావుగా ఉంది కానీ అందులో మ్యాటర్ లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రజల సమస్యలు గవర్నర్ ప్రసంగంలో రాలేదని.. కనీసం ఈ బడ్జెట్ లోనైనా వస్తాయని ఆశ ఉండేది అన్నారు. కాన్సర్ రోగులు, గుండె రోగుల ప్రస్తావన బడ్జెట్ లో రాలేదన్నారు. విభజనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల గురించి బడ్జెట్ లో లేదన్నారు . యాదగిరి గుట్ట కు మెట్రో కావాలని డిమాండ్ చేసాము కానీ ప్రస్తావన లేదని దుయ్యబట్టారు. హరీష్ రావు ఓ పుస్తకం తెచ్చి పాఠం చదివి వెళ్లారని ఎద్దేవా చేశారు. అనాధాపిల్లలను ఆదుకుంటామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.. కానీ బడ్జెట్లో ప్రస్తావన లేదన్నారు. తెలంగాణ ప్రజల కోసం అసెంబ్లీ లోపల, బయట పోరాటం చేస్తామన్నారు. బడ్జెట్ లో సవరణలు చేయాలన్నారు.

- Advertisement -

బిసిలకు 6వేల కోట్లు మాత్రామే బడ్జెట్ కేటాయించారని అన్నారు. 8 ఏళ్లుగా ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ నిదులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. రుణమాఫీ సరిగ్గా చేయకపోవడంతో 16లక్షల మంది రైతుల అకౌంట్స్ నిర‌ర్ధ‌కంగా మిలిగిపోయాయన్నారు. ఇక నిరుద్యోగ భృతి, గిరిజనబంధు ఊసే లేదన్నారు. లిక్కర్ ఆదాయం బడ్జెట్ లో బాగా కనిపించిందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఉపయోగపడే నిదులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం అనే నాలుగు సూత్రాలు బడ్జెట్ లో కనిపించలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement