Thursday, November 21, 2024

Congress Campaign – కెసిఆర్ పాల‌న‌లో వారి నేత‌ల‌కు ఇంద్ర‌భ‌వ‌నాలు…పేద‌ల‌కు మాత్రం పూరి గుడిసెలు .. ప్రియాంకా గాంధీ

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి – ప్రజా పాలన కోసం కాంగ్రెస్ పోరాడుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. సోమవారం యదాద్రిభువనగిరి జిల్లాలోని ఎన్నికల ప్రచారం లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలుపు కోరుతూ భువనగిరి పట్టణ కేంద్రంలో ఏర్పటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. భాజపా, భారాస, అన్నదమ్ములని, వారి చిన్న తమ్ముడు ఎంఐఎం అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దొరికి కాడికి దోచుకున్న ప్రభుత్వాలకు చరమ గీతం పడాలన్నారు. నోట్ల రద్దు, కరోనా, జిఎస్టీ లతో సామాన్యులు ఇబ్బందులు పాలయ్యారని, ప్రజా సమస్యలను ఏనాడు కూడా పట్టించుకోలేదన్నారు. అధికారం కోసం పాకులాడే పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటు పడేదే కాంగ్రెస్ అన్నారు. వారి సంక్షేమం కోసం కార్పొరేషన్ లను ఏర్పాటు చేస్తామన్నారు

తెలంగాణ కోసం ఎంతోమంది తమ రక్తాన్ని, ప్రాణాన్ని దారపోసారని, తల్లి సోనియా గాంధీ తో రాష్ట్రం ఏర్పాటు చేస్తే నేడు ఎట్లా ఉందొ మీరే అర్ధం చేసుకోవాలన్నారు. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో ఏవిధంగా ప్రజా పాలన ఉందొ తెలంగాణ లో కూడా అలాగే ఉంటుందన్నారు. కాంగ్రెస్ ను ఆదరించాలని కోరారు.రాహుల్ గాంధీ ఒక శక్తి అని, దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నత వరకు ఎవ్వరు ఏమి చేయారన్నారు. కాంగ్రెస్ తోనే గె ప్రజా పరిపాలన సాధ్యమన్నారు.

త‌న ఎన్నిక‌ల ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ..
తెలంగాణ ప్రజలు రెండుసార్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్ ఏం చేసింది. తెలంగాణలో అత్యాచారాలు, రైతుల అత్మహత్యలు పెరిగాయి. కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ధి ఎంటో చూపిస్తాం. బీఆర్ఎస్ సర్కారు నుంచి పేదలకు ఏమీ రావడం లేదు
రైతు రుణమాఫీ కాక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ధరల పెరుగుదలను ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణ వచ్చాక యువకుల ఆకాంక్షలు నెరవేరలేదు. బీఆర్ఎస్ మంత్రలు, ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 6 గ్యారెంటీలను అమలు చేస్తాం. ట్రిబుల్ ఆర్ బాధితులకు అండగా పోరాడుతాం. తెలంగాణ కోసం యువత త్యాగం చేసింది. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రజల జీవితమే ఆగమైతది . మళ్లీ కేసీఆర్ వస్తే.. భూములు మాయం.. నిరుద్యోగులు ఆగం. కాంగ్రెస్ తోనే ప్రజల పాలన.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తం.. ఇళ్లు కట్టుకోడానికి రూ. 5 లక్షలు. మహిళలకు ప్రతి నెల రూ. 2 వేల 500. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. 200 యూనిట్ల ఉచిత కరెంట్.. రైతురూణమాఫీతో పాటు వరికి మద్దతు ధర.. పేదలకు రూ. 4 వేల పెన్షన్.. ఇందిరమ్మ రాజ్యం తీసుకోస్తాం. అధికారంలోకి రాగానే వరుస జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామంటూ’ ప్రియాంకా గాంధీ వ‌రాలు కురిపించారు.
ఈ సమావేశంలో మాణిక్యం ఠాకూర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement