Tuesday, November 19, 2024

Congress Campaign – బిజెపి – బిఆర్ఎస్ రెండో ఒక్క‌టే… వాటికి ఎంఐఎం తోక పార్టీ …రాహుల్ గాంధీ

కేసీఆర్, మోడీ ఒక్కరే.. – ఢిల్లీలో బీజేపీ ఉండాలి
తెలంగాణాలో బీఆర్ఎస్ ఉండాలి .ఇదే వీరిద్దరి కోరిక
పీఎం నరేంద్ర చేతిలో సీబీఐ. ఈడీ రిమోట్ కంట్రోల్
అందుకే కేసీఆర్ భయం భయం
మూడో మిత్ర పార్టీ ఎంఐఎం
బీజేపీ డబ్బులతో ఇతర రాష్ర్టాల్లో పోటీ
కాంగ్రెస్ పార్టీకి భయం లేదు.. పోరాటం ఆగదు
గెలిచి తీరుతాం .. ఆదిలాబాద్ విజయభేరీలో
కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ

బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండు పార్టీలూ ఒక్కటే, కేంద్రంలో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఉండాలనేది కేసీఆర్ కోరిక, తెలంగాణా సీఎంగా కేసీఆర్ ఉండాలనేది నరేంద్ర మోడీ కోరిక, ఇదే రెండు పార్టీల ఏకైక కోరిక, మూడో మిత్రపార్టీ ఎంఐఎం. కాంగ్రెస్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ బీజేపీ డబ్బులతో తమ పార్టీ అభ్యర్థులతో ఓట్లు చీల్చటం ఎంఐఎం డ్యూటీ అని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఈ మూడు పార్టీలపై విరుచుకుపడ్డారు.
ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ సభలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై మండి పడ్డారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కేరింతల నడుమ రాహుల్ గాంధీ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ నన్ను తట్టుకోలేక పోతున్నారు. తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నాపై 24 కేసులు పెట్టారు. బంగళా గుంజుకున్నారు. అయినా నేను భయపడలేదు. రాజీ పడలేదు. ఈ పోరాటం ఆగదు, మోదీ ఆలోచనలో మార్పు వచ్చేవరకూ పోరాడుతూనే ఉంటాను. నా ఇల్లు లాక్కుంటే ఏమైంది. దేశం నలుమూలల కోట్ల కొద్దీ ఇళ్లు ఉన్నాయి, పేదల గుండెల్లో ఇల్లు కట్టుకున్నా అందుకే మోదీ పట్ల అదరను, బెదరను అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.


ఇక తెలంగాణాలో కేసీఆర్కు సీఎం పదవి పోతే ఇల్లు ఉండదు. లక్షల కోట్లు దోచుకున్నాడు, ఈ విషయం నరేంద్ర మోదీకి తెలుసు. రిమోట్ కంట్రోల్ మోదీ చేతిలో ఉంది. సీబీఐ, ఈడీ ఉన్నాయి. కేసీఆర్ కుంభకోణాలపై నరేంద్ర మోదీ బటన్ నొక్కితే కేసీఆర్ కూలటం ఖాయం. కానీ మోదీ వేలు నొక్కడు, వేలు చూపిస్తాడు. అని రాహుల్ గాంధీ బీజేపీ, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు.
చాతి విరుచుకుని తిరుగుతున్న నరేంద్ర మోదీ గాలి తీసేశాం. తెలంగాణాలో కారు నాలుగు చక్రాల గాలిని తీసేశాం. ఇక్కడ ఏం జరిగింది బీజేపీని నరేంద్ర మోడీ కోపగించుకున్నాడు. ఇక కేసీఆర్, మోదీకి మూడో మిత్ర పార్టీ ఎంఐఎం. బీజేపీ పైసలతో ఈ పార్టీ ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ ఓట్లు చీల్చటం అలావాటు. అస్సాంలో కాంగ్రెస్ పార్టీని ఓడించటానికి, కాంగ్రెస్ ఓట్లు చీల్చటానికి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే ముస్లీంలకు టిక్కెట్లు ఇచ్చారని రాహుల్ గాంధీ ఈ మూడు పార్టీలను తూర్పారబట్టారు.


తెలంగాణాలో ఆడపడులను ఆర్థికంగా బలోపేతం చేయటానికి నెలకు రూ.2500లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, 1200 గ్యాస్ బండను రూ.500లకే అందిస్తామని, తెలంగాణ ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని, దీంతో ప్రతి మహిళలకు రూ.5000లు అందుతాయన్నారు. తెలంగాణాలో రైతుల పరిస్థితి ఏమీ బాగోలేదని, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్యను తట్టుకోలేక పోతున్నామని, ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం చేస్తామని, కౌలు రైతులు, పేద రైతులకు రూ.12000 వేలు చెల్లిస్తామని, రాష్ర్టంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement