Friday, November 22, 2024

Exclusive | మూడు విడతలుగా కాంగ్రెస్​ బస్సు యాత్ర.. ములుగు నుంచి తొలి దశ ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కాస్త స్పీడు గేరు వేసింది. ప్రచార కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేసింది. మూడు విడతల్లో బస్సు యాత్రలు నిర్వహించాలని డిసైడ్ చేసినట్టు తెలుస్తోంది.  18వ తేదీ నుంచి తొలి దశ.. దసరా తర్వాత రెండో దశ.. నామినేషన్ల ప్రక్రియ తర్వాత మూడో దశ యాత్ర ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కాంగ్రెస్​ పార్టీ చేపట్టే బస్సు యాత్రకు పార్టీ ముఖ్య నేత రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రానున్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో తొలి విడత బస్సు యాత్ర ఉండబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి రాహుల్, ప్రియాంక పాల్గొంటారని ఆ పార్టీ తెలంగాన వ్యవహారాల ఇన్​చార్జి ఠాక్రే తెలిపారు. కాగా, ములుగు నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని.. ఆ తర్వాత పెద్దపల్లిలో భారీ బహిరంగ సభ ఉంటుందని ఠాక్రే చెప్పారు. అనంతరం కరీంనగర్‌లో పాదయాత్ర, బహిరంగ సభ కూడా ఉంటాయని, జగిత్యాలలో రైతులతో రాహుల్ సంభాషిస్తారని వెల్లడించారు. ఇక.. నిజామాబాద్‌లో పాదయాత్ర , బహిరంగ సభ.. ఆర్మూర్‌లో రైతులతో రాహుల్ గాంధీ భేటీ అవుతారని మాణిక్ రావు చెప్పారు.

అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టి కేసీఆర్ హామీలను ప్రకటించారని ఆరోపించారు. సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలు ప్రకటించగానే.. కేసీఆర్ కనిపించకుండా పోయారని, ఆయనకు చలి జ్వరం వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.  

- Advertisement -

తాము మహాలక్ష్మీ అంటే కేసీఆర్ సౌభాగ్యలక్ష్మీ అన్నారని.. తాము సిలిండర్ 500 అంటే, కేసీఆర్ 400 అన్నారని రేవంత్​ దుయ్యబట్టారు. నిధులు లేవు , నిధులు సరిపోవు అన్న మాట ఉత్తదేనని రేవంత్ వ్యాఖ్యానించారు. సారా వేలం పాటలో పోటీ జరిగినట్లు మమ్మల్ని కాపీ కొట్టారని.. సోనియా గాంధీ ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలవుతాయని కేసీఆరే నిరూపించారని రేవంత్​ వ్యంగంగా మాట్లాడారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement