తన ప్రమేయం లేకుండా బిఆర్ ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకున్నారని, ఇలా జరిగి ఉండాల్సింది కాదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇదే సమయంలో దీనికి నిరసనగా ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ మారే ఆలోచన ఇప్పటివరకు ఐతే లేదని..బీజేపీ నుంచి ఎవరు తనను సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు,విప్ లు ధర్మపురి వేములవాడ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయి తొందరపడద్దని బుజ్జగించే ప్రయత్నం చేశారు.ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పెద్దలు నిమగ్నమయ్యారు. జీవన్ రెడ్డి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి.. మంత్రి శ్రీధర్ బాబు చేరుకున్నారు. బేగంపేటలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి ఆయనకు నచ్చచెప్పేందుకు యత్నిస్తున్నారు. కొద్ది సేపట్లో ఆయన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement