కరీంనగర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అనంతరం టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కరీంనగర్ వి పార్క్‌లో రాహుల్‌తో భేటీ కొదండరామ సమావేశమయ్యారు. ఈసందర్బంగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని ప్రొఫెసర్‌ను రాహుల్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోదండరాంను రాహుల్ కోరగా.. పోటీకి ఆసక్తి లేదని తేల్చి ప్రొఫెసర్ తేల్చిచెప్పారు. . బీఆర్ఎస్‌ను గద్దె దించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌తో సీట్ల సర్దు బాటుపై మరోసారి సమావేశం అవుతామన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ తర్వాత క్లారిటీ వస్తుందన్నారు. తమ లక్ష్యం నియంత్రత్వ కేసీఆర్‌ను ఓడించడమే అని కోదండరాం స్పష్టం చేశారు.
అలాగే ఎన్నికల్లో అవగాహన, బీఆర్ఎస్‌ను ఎదుర్కునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. తెలంగాణ ప్రయోజనల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రయోజనల కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని జన సమితి నిర్ణయించింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ముథోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను తెలంగాణ జనసమితి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ నియంత పాలన దించడానికే టీజేఎస్ ఏర్పడిందని కోదండరాం వెల్లడించారు. ఈ భేటీలో కేసీ వేణు గోపాల్, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు .