Friday, November 22, 2024

Congress Akarsh – జంపింగ్ ల‌పై హ‌స్తం జాగ్ర‌త్త‌లు… బిఆర్ఎస్, బిజెపి అసంతృప్తుల‌పై క‌న్ను

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :

ఎన్నికలకు మరో ఐదారు నెలల సమయమే ఉండటంతో.. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపాలని కాంగ్రెస్‌ పార్టీ ఆలోచన చేస్తున్నది. రెండు పర్యాయాలు అధికారానికి దూ రమైన హస్తం పార్టీ.. ఈసారి కచ్చితంగా అధికారంలోకి రావాలనే పట్టుదలతో టీ పీసీసీ గట్టి ప్రయత్నాలనే చేస్తోంది. ఒక వైపు పార్టీలోని ఉన్న నాయకులకు చే జారకుండా చూసు కుంటూనే.. మరో వైపు ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేస్తూనే ఉన్నది. ఇది భవిష్యత్తులోనూ కొనసాగించాలని అభి ప్రాయంతో ఉన్నారు. ఎన్నికల సమయంలో టికెట్ల కేటా యింపుల్లో గందరగోళం రాకుండా జగ్రత్త పడాలని ఆలొ చనతో కాంగ్రెస్‌ నేతలున్నారు. రాష్ట్రంలోని అధికార బీఆర్‌ ఎస్‌పైన, ఆ పార్టీలోని సగం మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. బీఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌లందరికి టికెట్లు ఇస్తే తమకు ప్రయోజనం కలు గుతుందని అభిప్రాయంతో కాంగ్రెస్‌ నేతలున్నారు. అందుకే బీఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌లకు సీట్లు ఇస్తారా..? ఇవ్వరా అని చెప్పాలని సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి పెంచాలని టీ పీసీసీ నిర్ణ యించింది. అందులో భాగంగానే సిట్టింగ్‌ల విషయంలో సీఎం కేసీఆర్‌ స్పష్టత ఇవ్వాలని టీ పీసీసీ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల జాబితాను బట్టే అభ్యర్థుల విషయంలో ముందడుగు వేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఆలోచన చేస్తున్నది.

కాగా, రాష్ట్రంలోని 119 అసెంబ్లిd నియోజక వర్గాలకు గా ను.. దాదాపు 60 నుంచి 70 శాతం వరకు అభ్యర్థుల వరకు కాంగ్రెస్‌ జాబితా రెఢీగా ఉందని ఆ పార్టీ నేతలు పలు సంద ర్భాల్లోనూ చెబుతూనే ఉన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత సిట్టింగ్‌ల స్థానాల విషయంలో టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ క్లియర్‌గానే ఉందని, సొంత పార్టీలో ఇతరుల నుంచి పోటీ కూడా లేదని చెబుతున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కు మా ర్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, జీవన్‌రెడ్డి, ఎమ్మె ల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, పొడెం వీరయ్య తో పాటు దాదాపు 50 నుంచి 60 అసెంబ్లిd నియోజక వర్గాల్లో అభ్యర్థులు రెఢీగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబు తు న్నాయి. ఈ నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఓ వైపు పార్టీ కార్యక్రమాలను నిర్వ హిస్తూనే.. మరో వైపు ప్రయివేట్‌ కార్య క్రమాల్లోనూ నిత్యం ప్రజలను కలుస్తూ బిజీగానే ఉంటున్నారు. ఈ నియోజక వర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు.

అయితే మిగతా నియోజక వర్గాల్లో మాత్రం ఒక్కో నియోజక వర్గం నుంచి ఐదారుగురు నాయకులు టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను కూడా పో టీ పడుతూ నిర్వహిస్తున్నారు. స్వచ్ఛందంగా సేవా కార్య క్రమాలను కూడా చేపడుతు.. నిత్యం జనంతోనే ఉంటున్నారు. ఇలాంటి నియోజక వర్గాల్లో టికెట్ల ప్రకటన చేస్తే.. ఇబ్బందులు తప్పవనే భయం హస్తం పార్టీ నేతలకు వెంటాడుతోంది. ఒక నాయకుడిని ప్రకటిస్తే.. మిగతా నలుగురు వ్యతిరేమయ్యే ప్రమాదం ఉందని, దీన్ని అధికార బీఆర్‌ఎస్‌ క్యాచ్‌ చేసు కుంటే.. మొదటికే మోసం వస్తుందనే భయంతో ఉన్నారు. అదే బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ అభ్యర్థుల జాబితా బయటికి వస్తే.. అప్పుడు జాబితా ప్రకటించినా పెద్దగా నష్టం ఉండదని, టికెట్‌ రానివారిని బుజ్జగించడానికి అవకాశ ఉంటుందనే అభి ప్రాయంతో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఎమ్మెల్సీ లేదా నామినెటెడ్‌ పదవులు ఇస్తామని, ముందుగా పార్టీ అభ్య ర్థిని గెలిపించుకోవాలనే బుజ్జగింపులకు అవకాశం ఉం టుందనే ఆలోచనతో హస్తం నాయకులు ఉన్నారు. గెలిచే అవ కాశం ఉన్న కొందరి నాయకులకు మాత్రం నియోజక వర్గంలో గట్టిగా పని చేసుకోవాలని టీ పీసీసీ నాయ కత్వం మౌఖింగా ఆదేశాలు ఇస్తున్న ట్లుగా సమాచారం.

బీఆర్‌ఎస్‌, బీజేపీ అసంతృప్తులకు గాలం..
గత కొన్ని రోజులుగా కాం గ్రెస్‌ పార్టీకి ఇతర పార్టీల నుంచి చేరికల జోరు కొనసాగుతోంది. ఇటీవలనే బీఆర్‌ఎస్‌కు చెందిన మా జీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. మరో ఐదు రోజుల్లో పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డితో పాటు మరి కొందరు నాయకులు హస్తం కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. వీరితో పాటు వివిధ పార్టీల్లోని అసం తృప్తులను కూడా చేర్చుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేస్తూనే.. ఇప్పటీ వరకు పార్టీ కోసం పని చేస్తున్న వారికి కూడా నష్టం జరగకుండా చూడాలనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకే అవ కాశమని.. మిగతా ఆశావాహులను నిర్లక్ష్యం చేసినా.. టికెట్‌ రానివారికి అధికారంలోకి న్యాయం చేస్తామనే హామీలతో బుజ్జగించాలనే నిర్ణయానికి వచ్చారు. పార్టీలోని అసం తృ ప్తులు బీఆర్‌ఎస్‌ వలలోకి చిక్కకుండా జగ్రత్త పడాలని అభి ప్రాయంతో ఉన్నామని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement