మాజీ మంత్రి, కొత్తగూడెం ఎమ్మెల్యే, సీనియర్ పొలిటీషియన్ వనమా వెంకటేశ్వరరావుకు ఇటీవలే వెన్నెముక ఆపరేషన్ జరిగింది. గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో ఈ సర్జరీ నిర్వహించారు. డాక్టర్ జీపీవీ సుబ్బయ్య బృందం ఈ ఆపరేషన్ చేసింది. 70 ఏళ్లకు పైగా వయసున్న వనమాకు మూడు చోట్ల రిస్క్‌తో కూడిన వెన్నెముక సర్జరీని సక్సెస్ చేశారు.
కాగా, అంతర్జాతీయ స్పైన్ సర్జన్.. 3500 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ సుబ్బయ్యను బుధవారం వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రామకృష్ణ కలిసి అభినందనలు తెలియజేశారు. ఎంతో కష్టతరమైన ఈ ఆపరేషన్ని సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా గ్రీటింగ్స్ తెలిపిన వారిలో గమన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నందకిశోర్, కొత్తగూడెం వసుంధర గ్రూప్ చైర్మన్ శంకర్, ఆంధ్రప్రభ జనరల్ మేనేజర్ పసునూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.