రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క మణుగూరులో పర్యటిస్తున్నారు. డివి రాయల్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రి పాల్గొన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య లు పాల్గొన్నారు. ఈసందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంత్రి సీతక్కను శాలువాతో సత్కరించారు.
మహబూబాబాద్ పార్లమెంట్, పినపాక నియోజకవర్గ బూర్గంపాడు మండలం పర్యటనలో భాగంగా మంత్రి సీతక్కతో కలిసి పలు కార్యక్రమాల్లో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు. వారితో పాటు భద్రాచలం మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగల శ్రీనివాసరెడ్డి, పినపాక నియోజకవర్గం నాయకులు బట్ట విజయ గాంధీ, యూత్ కాంగ్రెస్ నాయకులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.