Friday, November 22, 2024

Crowd devotees: ప్ర‌సిద్ధ ఆలయాల్లో భక్తుల రద్దీ… వ‌రుస సెలవుల‌తో దేవాల‌యాల‌కు ప‌య‌నం

వ‌రుస సెలవులు రావ‌డంతో భ‌క్తులు దేవాల‌యాల‌కు బాట ప‌డుతున్నారు. తెలంగాణ‌లోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటేత్తుతున్నారు. ముఖ్యంగా మేడారం జాత‌ర స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు.

అలాగే భ‌ద్రాద్రి, కొండ‌గ‌ట్టు, వేముల‌వాడ‌, యాదాద్రి ఆల‌యాల్లో భ‌క్తుల ర‌ద్దీ క‌నిపిస్తుంది. భద్రాద్రి రామయ్య అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ లక్ష్మణ సమేత సీతారాములకు ఆలయ అర్చకులు బంగారు తులసీదళాలతో అర్చన చేశారు. రద్దీ నెలకొనడంతో నిత్య కల్యాణ వేడుకను.. చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్నారు. ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికీ భక్తులు పోటెత్తారు. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్‌లు నిండి వెలుపల వరకు బారులు తీరారు. వందలాది వాహనాలతో ఘాటు రోడ్డు, ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement