తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరుతో ఉన్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గానికి చెందిన ఫ్లెక్సీలు, హోర్డింగులను, కటౌట్లను దుండగులు ధ్వంసం చేశారు. దీంతో ఆపార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఎన్నికలపై హైకమాండ్ కు అన్నీ చెబుతానన్న విషయం తెలిసిందే. కోమటిరెడ్డి ఈనెల 9, 10 తేదీల్లో కొంపల్లిలో కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి మహిపాల్ రెడ్డి కోమటిరెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను కత్తిరించడంతో విభేదాలు చోటుచేసుకున్నాయి..
Advertisement
తాజా వార్తలు
Advertisement