నిజామాబాద్ అర్బన్ (ప్రభ న్యూస్) : దొంగిలించిన సెల్ ఫోన్ కొన్న యువకుడు అ విషయం తెలిసి దానిని రిటర్న్ ఇచ్చి తాను ఇచ్చిన డబ్బులు తనకు ఇవ్వాలని కోరడం ఆ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. సెల్ పోన్ ను చోరి చేసి విక్రయించిన యువకులు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన యువకుడిపై రాడ్ తో దాడి చేసి యాసీడ్ పోసి పరార్ అయ్యారు. నిన్న రాత్రి నిజామాబాద్ సిటీలోని డెయిరీ ఫారం ప్రాంతంలో జరిగిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని బాబాన్ సహబ్ పహడ్ కు చెందిన షెక్ కలీం ( 23కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి దొడ్డి కోమురయ్య కాలనికి చెందిన రంజానీ అనే యువకుడు స్నేహితుడు. రంజానీకి కోజా కాలనీకి చెందిన ఫారుఖ్, ఫిలా స్కూల్ ప్రాంతానికి చెందిన మతిన్ అనే మరో ఇద్దరు స్నేహితులున్నారు. ఆ ముగ్గురు చిల్లర దోంగతనాలు చేస్తుంటారు. ఇటీవల వారు ఒక సెల్ పోన్ దొంగిలించి దాన్ని షేక్ కలీంకు రూ.4,500కు విక్రయించారు.
అయితే.. అది వారు చోరి చేసి విక్రయించిన విషయం తెలిసిన కలీం దానిని వాడటం ఇబ్బంది అని సెల్ పోన్ ను వారికి రిటర్న్ ఇచ్చేశాడు. దాంతో అతనికి రూ.3,500 తిరిగి ఇచ్చారు. కలీం తనకు మిగతా రూ. 1000 ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. చోరి చేసుకోచ్చారని పదే పదే అనడంతో మంగళవారం దావత్ చేసుకుని డబ్బులు ఇస్తామని నమ్మబలికారు. కలీం చేత మద్యం తాగించి చితక బాదారు. తర్వాత వాహనాల బ్యాటరీలలో వాడే యాసీడ్ పోసి పరారీ అయ్యారు. ఈ ఘటనలో కలీం వీపు మొత్తం కాలిపోయింది. బాధితుడు ప్రస్తుతం జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని కుటుంబ సభ్యులు స్థానిక 6వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.