Wednesday, November 20, 2024

NZB: మహిళలకు టికెట్ కొట్టిన కండక్టర్.. విచార‌ణ ఆదేశించిన ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ..!

నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసి కండక్టర్ నిర్వాకం బయటపడింది. నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న బస్సులో ఓ కండక్టర్ మహిళలకు టికెట్ కొట్టాడు. ఉచిత బస్సు సౌకర్యం ఉందన్నా కండక్టర్ వినలేదు. ఈ క్రమంలో.. కండక్టర్ వ్యవహారాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేశారు బాధితులు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు. వెంటనే.. కండక్టర్ ను విధుల నుంచి ఆర్.ఎం. జాని రెడ్డి తప్పించారు. బోధన్ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న నర్సింహులుగా గుర్తించారు.

సంబంధిత కండక్టర్ ను డిపో స్పేర్ లో ఉంచాం. విచారణ అనంతరం కండక్టరుపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే.. ఇవాళ‌ బస్సులో ప్రయాణిస్తున్న మహిళల నుంచి ఓ కండక్టర్ ఛార్జీలను వసూలు చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏపీ 25జెడ్ 0062 నెంబరు గల బస్సు నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తుండగా ముగ్గురు మహిళలు నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్లేందుకు బస్సు ఎక్కారు. ముగ్గురు మహిళల దగ్గర బస్సు టికెట్ కోసం డబ్బులు వసూలు చేశాడు కండక్టర్.

మహిళలను నుంచి ఛార్జీలు వసూలుకు సంబంధించిన వీడియో సోషల్ వైరల్ అయింది. బాధితురాలి బంధువులు ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ డిపో మేనేజర్ తో పాటు టీఎస్ ఆర్టీ సీ ఎండీ సజ్జనార్ కూడా స్పందించారు. కండకర్టపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement