Friday, November 22, 2024

Condemned – క‌ర్నాట‌క మంత్రిపై కెటిఆర్ ఫైర్ … రైతుల‌పై ఇలాంటి కామెంట్స్ త‌గ‌దంటూ హిత‌వు ..

హైద‌రాబాద్ – రైతులు కరవు రావాలని కోరుకుంటున్నారన్న కర్ణాటక మంత్రి శివానంద్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు కర్ణాటక మంత్రి ట్వీట్‌ను ఆయన రీట్వీట్ చేస్తూ ఖండించారు. రైతులకు ఒకే ఒక్క కోరిక ఉందని.. ప్రతి ఏడాది కరవు రావాలని వారు కోరుకుంటున్నారని… అప్పుడు ప్రభుత్వం నుంచి రుణమాఫీ డిమాండ్‌ చేయవచ్చని వారు ఆశపడుతున్నారంటూ కర్ణాటక మంత్రి శివానంద్ పాటిల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెళగావిలో జరిగిన ఓ సమావేశంలో రైతు రుణమాఫీలపై మంత్రి శివానంద్‌ పాటిల్‌ మాట్లాడుతూ… రైతులకు కరెంటు, నీరు ఉచితంగా లభిస్తున్నాయని.. ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో వ్యవసాయరంగ బలోపేతానికి సహకారం అందించారన్నారు. కానీ రైతులు మాత్రం ప్రతి సంవత్సరం కరవు రావాలని కోరుకుంటున్నారని.. దీనివల్ల ప్రభుత్వం నుంచి రుణమాఫీ పొందవచ్చని భావిస్తున్నారన్నారు. అలా మీరు కోరుకోవడం సరికాదని రైతులకు సలహా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. శివానంద్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఎంతటి దుర్బర పరిస్థితుల్లోనైనా సరే రైతులు కరవును కోరుకోరని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement