Monday, November 25, 2024

100% వ్యాక్సినేషన్ పూర్తి చేయండి: మంత్రి కొప్పుల

కరోనాను పూర్తిగా అరికట్టేందుకు, వ్యాక్సినేషన్ 100% లక్ష్యాన్ని త్వరితగతిన చేరుకునేందుకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాల‌ని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయం నుంచి జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులతో వర్చువల్ మీటింగ్ నిర్వ‌హించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, రవిశంకర్, జడ్పీ ఛైర్మన్లు పుట్టా మధు, దావ వసంత, కలెక్టర్లు రవి, సంగీతా సత్యనారాయణతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం సేకరణ, హరితహారం, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు మంచి ఫలితాలు సాధించిన మాదిరిగానే వ్యాక్సినేషన్ ను 100%త్వరితగతిన పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి రోజు తెలుసుకోవడం జరుగుతుందని గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి, రాగినేడు, శ్రీరాంపూర్, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, మల్లాపూర్ తదితర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వ్యాక్సినేషన్ చాలా తక్కువగా నమోదు కావడానికి గల కారణాలను గుర్తించి, ప్రజలలో విస్త్రత అవగాహన పెంపొందించాలని మంత్రి సలహానిచ్చారు. ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి,సమన్వయం చేసుకుంటూ, అధికారులతో కమిటీ ఏర్పాటు చేసుకుని వ్యాక్సినేషన్ ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేయాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement