హాజీపూర్ (ప్రభ న్యూస్): గ్రామపంచాయతీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సమస్యలను పరిష్కరించకుండా గందరగోళం సృష్టిస్తున్న కార్యదర్శిపై మంచిర్యాల డీపీవోకు ఫిర్యాదు అందింది. సర్టిఫికెట్స్ ఇవ్వడంలో జాప్యం చేస్తూ ప్రతి ఒక్కరిని లంచం అడుగుతూ, సమయపాలన పాటించడం లేదని సర్పంచ్ ఈ ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా డ్యూటీ కూడా సరిగా నిర్వహించకుండా గ్రామపంచాయతీ ఆదాయానికి గండి కొడుతూ, అక్రమార్జనకు పాల్పడుతున్న నర్సింగాపూర్ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ మట్టపల్లి మంజుల జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర రావుకు ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
- Advertisement -