Monday, November 25, 2024

Competition – రీల్ చేయండి….రూ.75వేలు పట్టండి

హైదరాబాద్ – ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి. కూర్చున్నా.. నిలబడినా.. తుమ్మినా.. దగ్గినా.. ఏం చేసినా వీడియో తీసి..దానికి కాస్త బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ట్రెండ్. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ రీళ్ల ప్రభావం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూత్ అంతా ఈ రీల్ ట్రెండ్ కి అడిక్ట్ అయిపోయారు. అయితే.. ఈ రీళ్లకు లక్షల్లో వ్యూస్ రావడం.. చాలా మంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారు ఏం చేసినా చాలా మంది ఫాలో అవుతారు. అయితే.. ఇలాంటి రీళ్లు తయారు చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. వాటిని చూసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. తెలంగాణ సర్కార్ ఈ రీళ్లు తయారు చేసే వారికి తీపి కబురు వినిపించింది

అయితే తెలంగాణలో డ్రగ్స్ వాడకం ఎక్కువైపోతోంది. యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారి వారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. అంతర్జాతీయ డ్రగ్ అండ్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ 26న షార్ట్ వీడియో కాంటెస్ట్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. రీళ్ల ట్రెండ్ నడుస్తుండగా.. ఈ సందేశాన్ని ప్రజల్లోకి సులువుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో.. ”డ్రగ్స్ అండ్ ఇట్స్ ఎడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ” పేరుతో పోలీస్ శాఖ కాంటెస్ట్ నిర్వహించనుంది. 18 ఏళ్లు నిండిన వారందరూ ఈ పోటీలకు అర్హులని ప్రభుత్వం తెలిపింది. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, డ్రగ్స్ కు బానిసలైన వారి కుటుంబ సభ్యుల బాధలను ఈ రీళ్లలో చూపించడమే ఈ పోటీ ఉద్దేశం. అయితే.. ఈ వీడియోను 3 నిమిషాల నిడివితో రూపొందించాల్సి ఉంది. ఈ వీడియోలను జూన్ 20లోపు పంపాల్సి ఉంటుంది. ఈ పోటీలో విజేతలకు బహుమతులు అందజేయబడతాయి. మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ. 75,000 , రెండో స్థానంలో గెలిచిన వారికి రూ. 50,000, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 30,000 ప్రైజ్‌గా ఇవ్వబడుతుంది. ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం నిర్వాహకులను 96523 94751 నంబర్‌లో సంప్రదించవచ్చని పేర్కొంది

Advertisement

తాజా వార్తలు

Advertisement