Thursday, November 21, 2024

TS: ధాన్యం కొనుగోళ్లు షురూ.. పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్ చౌహాన్‌

అన్ని ఏర్పాట్లు చేసిన పౌరసరఫరాలశాఖ
గతంలో కంటే 200 కొనుగోలు కేంద్రాలు అధికం
చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :
ఈ ఏడాది యాసంగి ధాన్యం కొనుగోళ్లు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7149 కొనుగోలు కేంద్రాల్లో వ‌డ్ల కొనుగోలునూ పౌరసరఫరాలశాఖ చేపట్టనుంది. ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌. చౌహాన్ చెప్పారు. నిజామాబాద్‌, నల్గొండ జిల్లాల్లో 19 సెంట‌ర్ల‌లో ధాన్యం కొనుగోళ్లు చేప‌ట్టారు. ఏప్రిల్‌ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు ఎవరూ ప్రారంభించకూడదని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో భారీ ప్రారంభోత్సవ కార్యక్రమం లేకుండానే కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

75 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల అంచ‌నా..

ఈ సీజన్‌లో 75లక్షలా 40వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాలశాఖ అంచనా వేస్తోంది. మండు వేసవి నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద నీడ కోసం టెండ్లు, తాగునీటి సదుపాయం, విద్యుత్‌ సదుపాయం క‌ల్పించాల‌ని పౌర స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు తెలిపారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ధాన్యం తడవకుండా, ఇతరత్రా దెబ్బతినకుండా టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్‌ కాంటా, తేమ కొలిచేయంత్రాలు, ప్యాడీ క్లీనర్లను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement