అబద్ధాల బడ్జెట్ కాదు
మొదటి రోజే నిజం చెప్పాలి అనుకున్నాం
గత బడ్జెట్ కంటే 70 వేల కోట్లు మైనస్
మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది
మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్
రాష్ట్ర బడ్జెట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో పలు విషయాలు షేర్ చేసుకున్నారు. గత బడ్జెట్ కంటే 70వేల కోట్లు మైనస్ అయిందన్నారు. 23శాతం బడ్జెట్ తగ్గిందని, గతంలో బడ్జెట్లు అబద్ధాలతో నడిపించారన్నారు. ‘‘మేము అబద్ధాలతో బడ్జెట్ పెట్టలేదు.. మొదటి రోజే నిజం చెప్పాలి అనుకున్నాం.. ఇరిగేషన్ లో గతంలో 16వేల కోట్లు అప్పులు కట్టారు. అక్కర లేకున్నా పిలిచిన టెండర్లు రద్దు చేస్తాం. రుణమాఫీ రద్దు చేస్తాం. బ్యాంక్ లతో చర్చలు జరుగుతున్నాయి. మా ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. అని సీఎం స్పష్టం చేశారు.
విజిలెన్స్ విచారణ జరుగుతుంది..
ఇక.. ఇరిగేషన్ పై శ్వేత పత్రం పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాగ్ నివేదిక సైతం పెడతామన్నారు. ‘‘మేడిగడ్డ కు ప్రతిపక్ష నాయకులను సైతం పిలుస్తాం. మేడిగడ్డ పై విజిలెన్స్ విచారణ జరుగుతోంది.. తరువాత జుడిష్యల్ ఎంక్వైరీలో దోషులు తెలుతారు. కాళేశ్వరం టూర్ కు ప్రతిపక్ష నాయకుడుకి ఎప్పుడు టైం ఉందో చెప్పాలి. ఒక రోజు ముందు వెనుక అయినా మేము రెడీగా ఉన్నాం. మాట్లాడుదాం అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదు కదా అని సీఎం కామెంట్స్ చేశారు.