మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ విజయం సాధించినప్పటికీ నైతిక విజయం కాంగ్రెస్‌దేనని మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయం సాధించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కి 920, కాంగ్రెస్‌కు 350, బీజేపీకి 100 ఓట్లు ఉన్నాయన్నారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 763 ఓట్లు, కాంగ్రెస్ కు 662 ఓట్లు వచ్చాయన్నారు. ప్రజాభిప్రాయం మేరకు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ కు ఓటు వేశారన్నారు. కాంగ్రెస్ కి 300 ఓట్లు అధికంగా వచ్చేవి అన్నారు. ఇంకా 48 గంటల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వస్తాయని, విజయం ఎవరి వైపు ఉంటుందో తెలుస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందన్నారు. ఏ ఎన్నిక అయిన కాంగ్రెస్ దే విజయం అన్నారు.